ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, January 1, 2012

శుభాకాంక్షలనేవి ఆనవాయితాగా చెప్పేవి కాకూడదు



డియర్ స్టూడెంట్స్,
v  శుభాకాంక్షలనేవి ఆనవాయితాగా చెప్పేవి కాకూడదు. నిండైన మనసుతో … మీ భావి జీవనం స్వర్గ తుల్యం కావాలని మనసా ఆకాంక్షిస్తూ,ఆశీర్వదిస్తూ  5 మంచి మాటలతో ఈ నూతన సంవత్సరాన/మీ పుట్టిన రోజున  నా  శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను

v  మోయలేని భారాన్ని నవమాసాలు మోసి,అలవిమాలిన బాధను భరించి మనకు జన్మనిచ్చిన ఆ తల్లి మనసును ఎప్పుడూ కష్టపెట్టకండి.(కష్టపడి చదవడం ద్వారానే అది నీకు సాధ్యం)
v  తన రక్తాన్ని రంగరించి, కండల్ని కరగించి నిరంతరం శ్రమించి తన బిడ్డలు మానవులలో మాన్యులై ,అసామాన్యులై వెలుగొందాలన్న పిచ్చిప్రేమతో మీకోసం ఎన్నెన్నో వేదనలను భరించే ఆ తండ్రి మనసును గాయపర్చకండి.  (ఆకాశమే హద్దుగా వున్న నేటి అవకాశాలను అందిపుచ్చుకొని మీకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారానే ( JOB తెచ్చుకోవడం ద్వారా) ఇది సాధ్యం.
v  మీపట్ల వాత్సల్యాన్ని అణువణువునా నింపుకొని మీకు విధ్యాబుద్దులు నేర్పే మీ ఉపాధ్యాయులను, సర్వదా మీ మంచికోరే మీ ఆప్తులను,నేస్తాలను, మీరు జన్మించిన ఈ జన్మభూమిని ఏనాటికి మరువకండి.
v  ఎవరినుండి మీరు ఎంత చిన్న మేలు అందుకున్నా వారికి కృతజ్ఞతలు తెలియ జేయండి. మీకారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా క్షమాపణలు చెప్పడం మీ జీవన గమనంలో అలవాటుగా మార్చుకోండి.
v  ప్రతి చిన్న బాధకూ, అతి చిన్న అపజయానికి గుండెలు పిండిచేసే బాధకు గురికాకుండా “టేకిట్ ఈజీ పాలసీ” ని అలవర్చుకొని నవ్వుతూ,నవ్విస్తూ జీవిత నందన వనంలోని ప్రతి అడుగులో నవ్వులు పండిస్తూ ముందుకు సాగి పొండి. సదా మీ క్షేమాన్ని అభివృద్దిని ఆకాంక్షిస్తూ, మరోసారి నూతన సంవత్సర/పుట్టిన రోజు  శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను.
ఇట్లు,

మీ ప్రతాప్ మాస్టర్ 

2 comments:

Unknown said...

i like you sir

V.Venkata Pratap said...

Thank YOU RAVIKUMAR SIR

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates