ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Saturday, December 13, 2014

అందమైన అందం




  • ఎర్రగా అందంగా ఉంటే.....She is as fair as a rose అంటూ గులాబీతో పోలుస్తాం....
  • ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని అంతరిక్షంతో పొలుస్తూ .. The place is as empty as space అంటాం.
  • ఎవరైనా పులిలా కోపంగా ఉంటే..He is as fierce as a tiger అంటాం.
  • పట్టుదలతో ఒక దాన్నే అంటిపెట్టుకొని ఉంటే.. She is as firm as a rock అంటాం..
  • గాలిలా నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఉండలేవు అంటే..You are not as free as air/the wind అంటాం.
  • పక్షి తో కూడా పోలుస్తూ ..She is as free as a bird .. అంటాం.
  • రక రకాల రంగులతో ఉన్నదాన్ని సీతాకోక చిలుకతో పొలుస్తూ ..It is a colorful s a butterfly  అంటాం.
  • మృదు స్వభావంతో ఉంటే..He is as gentle as a lamb అంటూ..గోర్రేపిల్లతో పోలుస్తాం.
  • పావురంలా హాని చేయకున్దావుంటే She is as gentle as a dove  అంటాం.
  • తళతళ మెరుస్తున్న దాన్ని బంగారంతో పోలుస్తూ..It is as good as gold  అంటాం.
  • చావులా భయంకరంగా,విషాదంగా ఉన్నప్పుడు It is as grim as death  అంటాం.
  • అయిష్టాన్ని నరకంతో పోలుస్తూ ..It is as hateful as hell  అంటాం.
  • అప్పుడే వేయించిన మిర్చీలు  వేడి వేడి గా ఉంటె..Mirchies are as hot as fire తో  పోలుస్తాం 
  • పసిపాపలు అమాయకత్వానికి ప్రతీకలు.ఎవరైనా అమాయకంగా ఉంటె..He is as innocent as a child అంటాం.
  • కష్టపడే వ్యక్తిని చీమతో పోలుస్తూ ..He is as industrious as an ant అంటాం.
  • నత్త లాంటి సోమరిపోతు ఉంటె -He is as lazy as a lobster/snail అంటాం.
  • తేలికగా ఉన్నదాన్ని ఈకతో పోలుస్తూ..It is as light as a feather అంటాం.
  • సహనాన్ని భూదేవితో పోలుస్తూ..She is as patient as the Earth అంటాం.
  • నెమలికి గర్వం ఎక్కువ..అందుకే..She is as proud as a peacock అంటాం.
  • మెరుపులా త్వరగా వచ్చింది అంటే..It is as quick as lightening అంటాం.
  • రేజర్ లా వాడిగా ఉంటె..It is as sharp as a razor  అంటాం.
  • బాతు లా చిల్లరగా ఉంటె..He is as silly as a goose అంటాం.
  • బాణంలా నిటారుగా పోతుంటే..It goes as straight as an arrow అంటాం.
  • తేనెలా తియ్యగా ఉంటె-It is as sweet as honey అంటాం.
  • పిరికి తనాన్ని కుందేలుతో పోలుస్తూ..He is as timid as a hare అంటాం.
  • కలలు అనిశ్చితం...అందుకే..It is as vague as a dream అంటాం
  • నిజమైన స్నేహితులు ఎప్పుడు సుస్వాగతం పలుకుతారు...అందుకే- It is as welcome as a friend అంటాం.
ఇలా వ్యక్తి ..సమయ సందర్భాలను చూసి, ఎదుటివాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకొని పై పోలిక పదబంధాలు వాడితే మన ఆంగ్లం ఇడియమాటిక్ గా, అలంకార   ప్రాయంగా ఉంటుంది..ఇవి "ఉద్యోగ సమాచారం"వారి స్పోకెన్ ఇంగ్లిష్ సిరీస్ బుక్స్ నుండి గ్రహించబడినవి..మరచి పోకండి..వీటిని మీరు చదివి వదిలేస్తే ఉపయోగం లేదు..వీటిని ఉపయోగించండి..అప్పుడే మీకు గుర్తు వుంటాయి..సెలవా మరి ...మీ ప్రతాప్..

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates